కర్ణాటకకు సీఎం విజయ్‌.. డీకేతో సమావేశం | CM Vijay Meeting With DK Shiva Kumar On Aug 3rd        | Sakshi
Sakshi News home page

కర్ణాటకకు సీఎం విజయ్‌.. డీకేతో సమావేశం

Jul 25 2026 7:14 AM | Updated on Jul 25 2026 7:14 AM

CM Vijay Meeting With DK Shiva Kumar On Aug 3rd       

సాక్షి, చెన్నై/బనశంకరి: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆగస్టు 3న కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో సమావేశమై కావేరి జలాల పంపిణీతో పాటు మేకెదాటు డ్యామ్ నిర్మాణం అంశాలపై చర్చించనున్నారు.

ఈ విషయాన్ని తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి వినోద్ కుంభకోణంలో శుక్రవారం వెల్లడించారు. కర్ణాటక ప్రభుత్వం కావేరి నీటిని విడుదల చేయకపోవడంతో మెట్టూరు జలాశయం పూర్తిగా ఎండిపోయిందని, దీంతో తమిళనాడులోని డెల్టా జిల్లాల్లో వరి సాగు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆయన తెలిపారు. అలాగే, కావేరి నదిపై మేకెదాటు వద్ద కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డ్యామ్ నిర్మాణాన్ని తమిళనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని మంత్రి స్పష్టం చేశారు.

కావేరి జల వివాదం నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కీలకంగా మారింది. ఈ భేటీలో నీటి విడుదల, రైతుల ప్రయోజనాలు, మేకెదాటు ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement